Allu Arjun : అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. “లీడింగ్ మ్యాన్ అఫ్ ది ఇయర్‌”గా ఐకాన్ స్టార్..

పుష్ప రాజ్ కి అరుదైన గౌరవం దక్కింది. తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నిర్వహించే "జెంటిల్‌మ్యాన్స్ క్వార్టర్లీ అఫ్ ది ఇయర్"లో బన్నీ చోటు దక్కించుకున్నాడు. సినిమా, ట్రావెలింగ్, ఫ్యాషన్, సంస్కృతి, క్రీడా ఇలా పలు అంశాల్లో అవార్డులు ఇచ్చి సత్కరిస్తారు. తాజాగా ఈ మ్యాగజైన్ 2022 విన్నర్స్ ని ప్రకటించింది.

Allu Arjun : అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. “లీడింగ్ మ్యాన్ అఫ్ ది ఇయర్‌”గా ఐకాన్ స్టార్..

Allu Arjun as GQ Leading Man of the Year 2022

Allu Arjun : పుష్ప రాజ్ కి అరుదైన గౌరవం దక్కింది. తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నిర్వహించే “జెంటిల్‌మ్యాన్స్ క్వార్టర్లీ అఫ్ ది ఇయర్”లో బన్నీ చోటు దక్కించుకున్నాడు. సినిమా, ట్రావెలింగ్, ఫ్యాషన్, సంస్కృతి, క్రీడా ఇలా పలు అంశాల్లో అవార్డులు ఇచ్చి సత్కరిస్తారు. తాజాగా ఈ మ్యాగజైన్ 2022 విన్నర్స్ ని ప్రకటించింది.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన..

పుష్పలో తన నటనకి, డాన్సులకి, మ్యానరిజంకి వరల్డ్ వైడ్ ఎంతోగుర్తింపు సంపాందించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ మ్యాగజైన్ ఐకాన్ స్టార్ ని.. GQ ‘లీడింగ్ మ్యాన్ అఫ్ ది ఇయర్’గా సత్కరించింది. అలాగే నార్త్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్ – యాక్టర్ అఫ్ ది ఇయర్, దీపికా పడుకోణె – గ్లోబల్ ఫ్యాషన్ పర్సనాలిటీ, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ – డైరెక్టర్ అఫ్ ది ఇయర్ మరియు స్పోర్ట్స్ నుంచి ఇండియన్ అథ్లెట్ అవినాష్ సాబ్లే – స్పోర్ట్స్ మ్యాన్ అఫ్ ది ఇయర్ గా సత్కరించింది.

కాగా అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం అభిమానులు చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళం, హిందీ, తమిళ, కన్నడ, దుబాయ్ లో అల్లు అభిమానులు పుష్ప2 అప్డేట్ కోసం నిరసన తెలియజేశారు. త్వరలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగుతాం అంటూ ఆల్టిమేటం జారీ చేశారు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందింస్తుందో చూడాలి.