Allu Arjun : ఓటీటీ తెరపైకి అల్లు అర్జున్.. ఆహా కోసం మరోసారి..

ఆహా(Aha) తెలుగు ఇండియన్ ఐడల్ లో ఎంతో మంది లోకల్ సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. తమన్, గీతా మాధురి, సింగర్ కార్తీక్ లు జడ్జీలుగా, హేమచంద్ర హోస్ట్ గా ఈ షో సాగుతోంది. ఇప్పటికే సెమీ ఫైనల్ కూడా అయిపోయి అంతా ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నారు.

Allu Arjun : ఓటీటీ తెరపైకి అల్లు అర్జున్.. ఆహా కోసం మరోసారి..

Allu Arjun as Guest for Telugu Indian Idol Final Episode

Aha : ఇటీవల ఓటీటీ(OTT)లు మరింత పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇక తెలుగు వారి ఓటీటీ ఆహాలో అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు వస్తూనే ఉన్నాయి. పలువురి ట్యాలెంట్స్ ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ షోలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) సింగింగ్ ప్రోగ్రాంని ఆహా ఓటీటీ నిర్వహిస్తుంది. గతంలోనే సీజన్ 1 నిర్వహించి సక్సెస్ అవ్వగా, ప్రస్తుతం సీజన్ 2 నడుస్తుంది.

ఆహా(Aha) తెలుగు ఇండియన్ ఐడల్ లో ఎంతో మంది లోకల్ సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. తమన్, గీతా మాధురి, సింగర్ కార్తీక్ లు జడ్జీలుగా, హేమచంద్ర హోస్ట్ గా ఈ షో సాగుతోంది. ఇప్పటికే సెమీ ఫైనల్ కూడా అయిపోయి అంతా ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి గెస్టులుగా పలువురు సెలబ్రిటీలు వస్తారని తెలిసిందే. ఈ ప్రోగ్రాంని మరింతమందికి చేరవేయడానికి ఆహా టీం పలువురు సినీ సెలబ్రిటీలను ఈ ప్రోగ్రామ్స్ కి తీసుకువస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీ ఫైనల్ కి దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ గా వచ్చారు.

Pushpa 2 : ప్రతీకారంతో తిరిగొచ్చిన షెకావత్ సర్.. పుష్ప 2 అప్డేట్..

త్వరలో ఫైనల్ ఎపిసోడ్ రానుండటంతో, ఆ ఎపిసోడ్ కి వచ్చే గెస్ట్ ని ఆహా టీం ఇండైరెక్ట్ గా ఎవరో ట్వీట్ చేసేసింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. దీంతో తగ్గేదేలే అన్నట్టు ఈ ఎపిసోడ్ ఉండబోతుంది. బన్నీ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.