‘పుష్ప’ రాజ్ వచ్చేశాడు!

  • Published By: sekhar ,Published On : November 12, 2020 / 03:18 PM IST
‘పుష్ప’ రాజ్ వచ్చేశాడు!

Pushpa Raj: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రారంభమైంది.


ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. పుష్పరాజ్ వచ్చేశాడు అంటూ వెనుకనుండి బన్నీ నడుస్తున్న పిక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం జుట్టు పెంచి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు స్టైలిష్ స్టార్.

Allu Arjunఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ‘పుష్ప’ లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ‘ఆర్య, ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.