Allu Arjun: మార్చిలో బన్నీ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. నిజమేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్ర సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Allu Arjun: మార్చిలో బన్నీ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. నిజమేనా..?

Allu Arjun Blockbuster Movie Desamuduru To Get Re-Release

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్ర సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Allu Arjun: షారుక్ సినిమాలో తగ్గేదే లే అంటోన్న బన్నీ..?

కాగా, మార్చి నెలలో బన్నీ నటించిన ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇంతకీ బన్నీ నటించిన సినిమా ఏమిటి.. మార్చిలో రిలీజ్ కానున్న ఆ సినిమా ఏమిటా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, బన్నీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘దేశముదురు’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మార్చి 28న థియేటర్లలో రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Allu Arjun : ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకో వద్దు.. అల్లు అర్జున్‌కి అభిమాని విన్నపం!

ఇక ఈ సినిమాకు చక్రి మ్యూజిక్ అందించగా, వెండితెరపై ఈ సినిమాకు యూత్ పట్టం కట్టారు. మరి నిజంగానే ఈ సినిమాను మార్చి 28న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారా అనే విషయంపై చిత్ర మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.