Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్ పక్కన టిఫిన్ చేసిన ‘ఐకాన్ స్టార్’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోకవరంలో రోడ్ పక్కన టిఫిన్ చేసిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్ పక్కన టిఫిన్ చేసిన ‘ఐకాన్ స్టార్’

Allu Arjun

Allu Arjun : సినిమా స్టార్స్ బయట కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది ఓ స్టార్ హీరో రోడ్ పక్కన హోటల్‌లో టిఫిన్ చేస్తే.. ఇక అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటిపనే చేశారు అల్లు అర్జున్..

Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా.. ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

ఓ సాంగ్, కొన్ని సీన్స్ షూట్ చెయ్యడానికి మూవీ టీం మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్లారు. శనివారం భారీ వర్షంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో బన్నీ చుట్టు పక్కల ప్రాంతాలను చూడ్డానికి బయలుదేరారు. కాకినాడ థియేటర్లో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చూశారు. గోకవరంలో రోడ్ పక్కన ఆగి, అక్కడున్న ఓ చిన్న హోటల్‌లో టిఫిన్ చేశారు. ఇప్పుడు ఆ పిక్స్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.