Updated On - 1:17 pm, Tue, 2 March 21
Allu Arjun Chief Guest: లాక్‌డౌన్ తర్వాత సినిమా పరిశ్రమ ఫుల్ బిజీ అయిపోయింది.. షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రిలీజులు, సక్సెస్ మీట్లతో క్షణం తీరికలేకుండా అందరూ ఉరుకులు పరుగులతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ గెస్ట్‌గా వచ్చాడు..
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నారు.
మార్చి 9న హైదరాబాద్, ఫిలింనగర్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో సాయంత్రం 5:30 నుండి ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..
Allu Arjun Family : వాట్ ఎన్ ఐడియా.. అల్లు ఫ్యామిలీ అదుర్స్ అంతే..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
Allu Arjun : ఇప్పటి వరకూ స్టైల్ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క
icon star: స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్
తగ్గేదే లే.. పుష్ప టీజర్.. అదిరిపోయింది