Allu Arjun: ‘దేశముదురు’ రీ-రిలీజ్‌తో సందడి చేయబోతున్న బన్నీ.. ఎప్పుడంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ‘దేశముదురు’ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Allu Arjun: ‘దేశముదురు’ రీ-రిలీజ్‌తో సందడి చేయబోతున్న బన్నీ.. ఎప్పుడంటే?

Allu Arjun Desamuduru To Re-Release On April 6

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఈయేడాది చివరినాటికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ క్రమంలోనే తన అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు సమ్మర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట బన్నీ. ఏప్రిల్ నెలలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు.

Allu Arjun: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్.. 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్!

బన్నీ కెరీర్‌లో స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ‘దేశముదురు’ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ మూవీలో బన్నీ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఇక అందాల భామ హన్సికా మోత్వానీ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు చక్రి సంగీతం నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో, ఈ సినిమాలోని సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి.

Allu Arjun : అల్లుఅర్జున్ న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

అయితే, ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను రీ-రిలీజ్ చేయాలని చాలా రోజులుగా అభిమానులు కోరుతుండటంతో, నిర్మాత డివివి దానయ్య, ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా రీ-రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ థియేటర్లలో సందడి చేయగా, ఇప్పుడు బన్నీ కూడా థియేటర్లలో దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. మరి దేశముదురు రీ-రిలీజ్‌తో ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.