Akhanda Pre Release Event : ‘అఖండ’ సాక్షిగా బన్నీ – బాలయ్య బాండింగ్ అదిరింది..

‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయింది..

10TV Telugu News

Akhanda Pre Release Event: మరో ఐదు రోజుల్లో నట‘సింహ’ గర్జనకు సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న బాక్సాఫీస్ బరిలో దిగుతున్న బాలయ్య.. ‘అఖండ’ తో మాస్ జాతర ఎలా ఉంటుందో మరోసారి చూపించబోతున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’.

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

Allu Arjun : నో టెన్షన్.. టాక్స్ నడుస్తున్నాయ్..

బాలయ్య ‘ఆహా’ లో షో చేస్తుండడం, బన్నీ త్వరలో బోయపాటితో రెండో సినిమా చెయ్యడంతో అతిథిగా ఆహ్వానించారని అంటున్నారు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ ఎంట్రీ అదిరిపోయింది. బాలయ్య, బన్నీ ఒకరినొకరు పలకరించుకుని, కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇరు హీరోల అభిమానుల హర్షధ్వానాల మధ్య శిల్పకళా వేదిక ప్రాంగణంలో సందడి రెట్టింపయ్యింది.

×