Allu Arjun : ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకో వద్దు.. అల్లు అర్జున్‌కి అభిమాని విన్నపం!

హీరోలను తమ అభిమానులు ఒక దేవుడిలా అభిమానిస్తుంటారు. అంతలా అభిమానించిన ఆ హీరోని ఒక్కసారి అయినా కలిసి ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు. కానీ ఆ హీరోకి ఉన్న బిజీ లైఫ్ వల్ల అందర్నీ కలవడం అనేది జరగని పని. దీంతో ఎంతోమంది అభిమానులు చాలా నిరాశకి గురవుతుంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమాని కూడా తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరుమున్నీరు అయ్యాడు.

Allu Arjun : ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకో వద్దు.. అల్లు అర్జున్‌కి అభిమాని విన్నపం!

Allu Arjun : హీరోలను తమ అభిమానులు ఒక దేవుడిలా అభిమానిస్తుంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా.. పాలాభిషేకాలు చేస్తూ, హారతులు ఇస్తూ ఒక పండగలా చేస్తుంటారు. అంతలా అభిమానించిన ఆ హీరోని ఒక్కసారి అయినా కలిసి ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు. కానీ ఆ హీరోకి ఉన్న బిజీ లైఫ్ వల్ల అందర్నీ కలవడం అనేది జరగని పని. దీంతో ఎంతోమంది అభిమానులు చాలా నిరాశకి గురవుతుంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమాని కూడా తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరుమున్నీరు అయ్యాడు.

Allu Arjun : పుష్పరాజ్‌కి లారీ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అయాన్..

అభిమానుల బాధని అర్ధం చేసుకున్న హీరోలు ఈ మధ్య కాలంలో ఫ్యాన్ మీట్ అంటూ ఒక కార్యక్రమం పెట్టి వాళ్లతో ఫోటోలు దిగి ఆనంద పరుస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఇటీవల వైజాగ్ లో ఒక ఫ్యాన్ మీట్ నిర్వహించాడు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆ కార్యక్రమాన్ని చివరి క్షణంలో క్యాన్సిల్ చేశారు. దీంతో ఒక అభిమాని తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా జరగడం మొదటిసారి కాదు 2-3 సార్లు నుంచి ఇదే రిపీట్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, ఫ్యాన్ మీట్.. ఇలా ప్రతి విషయంలో మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు.

మా బాధని అర్ధం చేసుకోండి. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకో వద్దు అన్న. ఒకసారి ఆలోచించు అన్నా.. అంటూ అల్లు అర్జున్ కి తమ బాధని తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో బన్నీ వరకు వెళ్లి, తన నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా? అనేది చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇటీవలే ఒక సాంగ్ ని చిత్రీకరించారు. రష్మిక మందన్న కూడా ఈ షూట్ లో పాల్గొంది.