Allu Arjun : అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా.. థ్యాంక్ యు దుబాయ్ అంటూ స్పెషల్ పోస్ట్..

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది. ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.................

Allu Arjun : అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా.. థ్యాంక్ యు దుబాయ్ అంటూ స్పెషల్ పోస్ట్..

Allu arjun Gets Golden Visa From Dubai Government

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా పుష్ప సినిమాతో చాలా పాపులర్ అయిపోయాడు. పుష్ప ముందు వరకు తెలుగు, మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పడు దేశవ్యాప్తంగా పేరు, అభిమానులని సంపాదించుకున్నాడు. బన్నీ నుంచి పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టారు.

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది. ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి..ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Varun Tej : బర్త్ డే సందర్భంగా బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు వరుణ్ తేజ్ సహాయం.. విరాళం ఎంతో తెలుసా?

సాధారణంగా దుబాయ్ గోల్డెన్ వీసా దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్లకి, అక్కడ బిజినెస్ చేసే వారికి, పలువురు సెలబ్రిటీలకు అందిస్తూ ఉంటుంది దుబాయ్ ప్రభుత్వం. గోల్డెన్ వీసా 5 లేదా పదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ టైంలో ఎన్ని సార్లైనా దుబాయ్ కి వెళ్లి రావొచ్చు, అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కొంత అమౌంట్ కూడా దుబాయ్ ప్రభుత్వం తీసుకుంటుంది. మన ఇండియా సెలబ్రిటీలలో ఎక్కువగా కేరళ వాళ్లకి గోల్డెన్ వీసా వస్తూ ఉంటుంది. కేరళ వాళ్లకి బిజినెస్ లు దుబాయ్ లో ఎక్కువగా ఉండటంతో వారికి అందిస్తారు. తెలుగు సెలబ్రిటీలతో చాలా తక్కువ మందికి మాత్రమే గోల్డెన్ వీసా లభించింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అల్లు అర్జున్ చేరారు.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)