Pushpa : ‘పుష్ప’ టీం మెంబర్స్‌కి గోల్డ్‌రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ పాటని లాస్ట్ లో చాలా త్వరగా షూట్ చేసినందుకు బ‌న్నీ ఇంప్రెస్ అయి ఈ సాంగ్ ఇంత తొందరగా పూర్తి చేసినందుకు 12మంది సిబ్బందికి ఒక తులం విలువైన...

Pushpa : ‘పుష్ప’ టీం మెంబర్స్‌కి గోల్డ్‌రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

Pushpa

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయి వైరల్ అయ్యాయి. వీటితో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss Sohel : బిగ్‌బాస్ సోహెల్‌తో ‘వకీల్‌సాబ్’ భామ

త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అల్లు అర్జున్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి టీవీ షోలకు, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక లాస్ట్ లో ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ ఉందని అనౌన్స్ చేసి మూడు రోజుల క్రితం ఈ ఐటెం సాంగ్ ని షూట్ చేశారు. మొన్న సోమ‌వారంతో ఈ ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ పాటని లాస్ట్ లో చాలా త్వరగా షూట్ చేసినందుకు బ‌న్నీ ఇంప్రెస్ అయి ఈ సాంగ్ ఇంత తొందరగా పూర్తి చేసినందుకు 12మంది సిబ్బందికి ఒక తులం విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట‌. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఉన్న‌ట్టు సమాచారం. దీంతో చిత్ర సిబ్బంది బన్నీని పొగిడేస్తున్నారట.