కట్టె కాలే వరకు ఆయన అభిమానినే : మరోసారి పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన బన్నీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హర్ట్ చేశాడా అంటే అవుననే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాటర్ ఏంటంటే... అల్లు అర్జున్ హీరోగా

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 07:28 AM IST
కట్టె కాలే వరకు ఆయన అభిమానినే : మరోసారి పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన బన్నీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హర్ట్ చేశాడా అంటే అవుననే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాటర్ ఏంటంటే… అల్లు అర్జున్ హీరోగా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హర్ట్ చేశాడా అంటే అవుననే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాటర్ ఏంటంటే… అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ”అల వైకుంఠపురములో”. హైదరాబాద్ యూసుఫ్ గూడలో సోమవారం(జనవరి 6,2020) ఈ మూవీ మ్యూజికల్ నైట్ జరిగింది. ఇందులో బన్నీ మాట్లాడుతుండగా.. అభిమానులు పవన్ కల్యాణ్ అని అరిచారు.

దీనికి స్పందించిన బన్నీ.. ”మీ కోసం పవన్ అంటాను అని అసహనం వ్యక్తం చేశాడు. నాకు చిరంజీవి అంటే ప్రాణం. కట్టె కాలే వరకూ ఆయన అభిమానినే. చిరంజీవి తర్వాత నేను చాలా అభిమానించేది సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని. రజనీ సార్ నాకొక రోల్ మోడల్. ఇన్సిపిరేషన్. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ మురుగుదాస్. వారిద్దరి కాంబినేషన్ లో దర్బార్ సినిమా సంక్రాంతికి వస్తోంది. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు, కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవు రా సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. వాటికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా” అని అల్లు అర్జున్ అన్నాడు. 

కాగా.. చిరంజీవి అన్నా, రజనీకాంత్ అన్నా నాకు చాలా ఇష్టం.. నేను వారి అభిమానిని అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బన్నీ కావాలనే పవన్ పై వ్యంగ్యంగా స్పందించాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇదివరకే పలు సినిమా ఈవెంట్లలో పవన్ ఫ్యాన్స్ కు, బన్నీకి మధ్య గొడవలు జరిగాయి. పవన్ ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ బహిరంగంగానే విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ”చెప్పను బ్రదర్” అంటూ అల్లు అర్జున్ ఓ సమయంలో అన్న పదం తెగ రచ్చ చేసింది.

Also Read : మా నాన్నకు పద్మశ్రీ : అల్లూ అర్జున్ రిక్వెస్ట్