Allu Arjun : శ్రీ చైతన్య యాడ్ లో అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఈ యాడ్ లో ఐఐటీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య, మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్యని ఎంచుకోవడంలో తగ్గేదే లే అనే స్లొగన్స్ తో అల్లు అర్జున్ ప్రచారం చేశారు. యాడ్ చూడటానికి బాగున్నా అల్లు అర్జున్

Allu Arjun : శ్రీ చైతన్య యాడ్ లో అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Aa (1)

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలే కాక అల్లు అర్జున్ చాలా యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు చేసిన అన్ని యాడ్స్ ఒక రకమైతే ఇప్పుడు చేసిన యాడ్ ఒక రకం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం అల్లు అర్జున్ యాడ్ చేశారు. మొదటి సారి ఒక విద్యా సంస్థ కోసం యాడ్ చేసారు అల్లుఅర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యాడ్ వైరల్ అవడమే కాక ట్రోల్ అవుతుంది కూడా. ఈ యాడ్ లో ఐఐటీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య, మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్యని ఎంచుకోవడంలో తగ్గేదే లే అనే స్లొగన్స్ తో అల్లు అర్జున్ ప్రచారం చేశారు. యాడ్ చూడటానికి బాగున్నా అల్లు అర్జున్ ఈ యాడ్ చేయడం ఇప్పుడు చర్చకి దారి తీసింది.

Mohan Babu : ‘మా’లో రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి.. అతని వల్లే విష్ణు గెలిచాడు : మోహన్ బాబు

ఇలాంటి కొన్ని విద్యాసంస్థలు బ్రాంచులు బ్రాంచులుగా కనీస సదుపాయాలు కూడా లేకుండా కాలేజీలు పెట్టేసి కేవలం మార్కుల కోసమే అన్నట్టు స్టూడెంట్స్ ని ఒత్తిడికి గురి చేస్తారు. అక్కడ హాస్టల్స్ లో కూడా చదువు తప్ప ఇంకేమి ఉండదు. బయటకి ర్యాంకులు అంటూ బాగా ప్రమోట్ చేసినా లోపల ఇంకోలా ఉంటుంది. చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. నిబంధనలు పాటించలేదని కొన్ని కాలేజిలని క్లోజ్ కూడా చేశారు. ఈ విద్య సంస్థలపై, వాటి యాడ్స్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. వాటికి నెగిటివ్ గా మీమ్స్ వేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్ ఇలాంటి కాలేజీని ప్రమోట్ చేయడం చర్చగా మారింది. దీంతో ఆ కాలేజీతో పాటు అల్లు అర్జున్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇటీవలే రష్మిక ని, మహేష్ బాబుని కూడా యాడ్స్ వల్ల ట్రోల్ చేశారు. సెలెబ్రిటీలు యాడ్స్ చేయడం తప్పు కాదు కానీ ఆ యాడ్ ఎలాంటిదో చూసి దాని గురించి తెలుసుకొని యాడ్ చేయాలి అంటున్నారు నెటిజన్లు.