Allu Arjun : మరోసారి అల్లు అర్జున్ బోయపాటి మాస్ కాంబినేషన్.. పుష్ప తర్వాతే??

అల్లు అర్జున్ బోయ‌పాటి కాంబినేష‌న్‌ లో సినిమా రాబోతుందని చెప్పారు. బోయపాటి చెప్పిన కథని అల్లు అర్జున్ ఓకే చేశారని, 'పుష్ప' తర్వాత ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మించబోతున్న

10TV Telugu News

Allu Arjun :  టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో రెడీ అయ్యారు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రాబోతుంది. ఇప్పటికే మాస్ హీరోగా అల్లు అర్జున్ చాలా సినిమాలు చేశాడు. ‘పుష్ప’ లో మరింత కొత్తగా కనపడబోతున్నాడు. మిగిలిన హీరోలంతా చాలా ఫాస్ట్ గా తమ నెక్స్ట్ సినిమాలని అనౌన్స్ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పటిదాకా సమాచారం లేదు. ‘పుష్ప’ పార్ట్1 తర్వాత పార్ట్2 కూడా ఉంది. అందుకే నెక్స్ట్ లైనప్ చేయలేదా అని ఆలోచిస్తున్నారు. కొరటాల శివతో సినిమా ఉంటుందని గతంలో ప్రకటించాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలీదు.

Racism : నిన్న నెపోటిజం.. ఇవాళ రేసిజం.. ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు

తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ బోయ‌పాటి కాంబినేష‌న్‌ లో సినిమా రాబోతుందని చెప్పారు. బోయపాటి చెప్పిన కథని అల్లు అర్జున్ ఓకే చేశారని, ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మించబోతున్నామని తెలిపారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అప్‌డేట్ రావ‌డంతో బ‌న్నీ అభిమానులు ఆనందిస్తున్నారు. అంతకుముందే 2016లో బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘సరైనోడు’ సినిమా వచ్చింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధించింది ఈ సినిమా. బోయపాటి సినిమాలంటేనే ఫుల్ మాస్ గా ఉంటాయి. ఇటీవలే బోయపాటి బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకున్నారు. ‘అఖండ’ రిలీజ్ అయ్యేలోపు పుష్ప షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఫుల్ మాస్ తో ఎంటర్టైన్ చేస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.