Allu Arjun : వికలాంగ అభిమానిని ఎత్తుకొని ఫొటో ఇచ్చిన బన్నీ..

అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6తో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ బయలుదేరిన అల్లు అర్జున్.. అభిమానులు కోసం వైజాగ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే...

Allu Arjun : వికలాంగ అభిమానిని ఎత్తుకొని ఫొటో ఇచ్చిన బన్నీ..

allu arjun fan meet

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి.. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కేవలం ఈ హీరో సినిమా అప్డేట్ కోసమే ఇటీవల ఇండియా వైడ్ అభిమానులు రోడ్డు పైకి వచ్చి నిరసన తెలియజేశారు అంటే బన్నీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోండి. అంతలా అభిమానించే తమ హీరోని ఒక్కసారి కలిసి ఫోటో దిగితే చాలు అని చాలా మంది అనుకుంటారు, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. తాజాగా అంతకు మించిన ఛాన్స్ ఒక వీరాభిమానికి దక్కింది.

Allu Arjun : ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకో వద్దు.. అల్లు అర్జున్‌కి అభిమాని విన్నపం!

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. 18 రోజులు పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకున్న పుష్ప ఫిబ్రవరి 6తో అక్కడి షెడ్యూల్ కి గుమ్మడి కాయ కొట్టింది. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ బయలుదేరిన అల్లు అర్జున్.. అభిమానులు కోసం వైజాగ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యాడు. గాదిరాజ్ ప్యాలస్, రుషికొండలోని రాడిసన్ బ్లూలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక తనని కలవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగి ఆనంద పరిచాడు అల్లు అర్జున్.

ఈ క్రమంలోనే ఒక వికలాంగుడు అయిన అభిమాని తనని కలిసేందుకు రాగా.. అల్లు అర్జున్ అతని ఎత్తుకొని మరి ఫోటో దిగి, ఆ అభిమానిని ఖుషి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నిన్న ఇదే ఈవెంట్ కి హాజరయిన కొంతమంది అభిమానులు మాత్రం నిరాశతో వెనక్కి వెళ్లారు. ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో అల్లు అర్జున్ అందర్నీ కలవడం కుదరలేదు. దీంతో ఒక అభిమాని తీవ్ర మనస్థాపానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.