Major: మేజర్ టీమ్‌కు హ్యాట్సాఫ్..!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఈ సినిమాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు...

Major: మేజర్ టీమ్‌కు హ్యాట్సాఫ్..!

Allu Arjun Praises Major Movie Team

Major: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఈ సినిమాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ జీవితకథ, ఆయన త్యాగాన్ని మరోసారి గుర్తుకు చేసిన ‘మేజర్’ చిత్ర యూనిట్‌ను సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

తాజాగా ‘మేజర్’ సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది తెలుగు సినిమా కాదని.. ఇది ప్రతి ఇండియన్ సినిమా అని ఆయన అన్నారు. ఇలాంటి ఎపిక్ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచన రావడమే గొప్ప.. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం వెనకుండి నడిపించిన తీరు అత్యద్భుతం అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మేజర్ పాత్రలో అడివి శేష్ నటించలేదని.. ఆయన మేజర్ సందీప్‌ను మన కళ్లకు కట్టినట్లుగా చూపించారని బన్నీ అన్నాడు.

Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

దర్శకుడు శశికిరణ్ ఎంచుకున్న సబ్జెక్ట్‌కు హ్యాట్సాఫ్. ఇలాంటి కథలు ఇంకా రావాలని.. ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు చాలా అవసరం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మేజర్ చిత్రాన్ని దేశప్రజలకు అందించి ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ప్రతిఒక్కరికీ అభినందనలు అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక ప్రకాశ్ రాజ్, రేవతిలతో పాటు సాయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాల తమ పాత్రల్లో ఒదిగిపోయారని బన్నీ కితాబిచ్చారు. కాగా.. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.