Pushpa 2 : ప్రతీకారంతో తిరిగొచ్చిన షెకావత్ సర్.. పుష్ప 2 అప్డేట్..

పుష్ప రిలీజయిన సంవత్సరానికి ఎన్నో కసరత్తులు చేసి పుష్ప 2 మొదలెట్టారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైజాగ్, రామోజీ ఫిలింసిటీ, మారేడుమిల్లి అడవుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ జరుపుకుంది.

Pushpa 2 : ప్రతీకారంతో తిరిగొచ్చిన షెకావత్ సర్.. పుష్ప 2 అప్డేట్..

Allu arjun Pushpa 2 Movie update Fahadh Faasil shoot completed

Allu Arjun : పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సౌత్ లో కంటే కూడా నార్త్ లో పుష్ప సినిమా మరింత హిట్ అయింది. ఇక పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. పుష్ప సినిమా అనుకోనివిధంగా సంచలన విజయం నమోదు చేసి పుష్ప 2 పై భారీ అంచనాలను నెలకొల్పింది.

పుష్ప రిలీజయిన సంవత్సరానికి ఎన్నో కసరత్తులు చేసి పుష్ప 2 మొదలెట్టారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైజాగ్, రామోజీ ఫిలింసిటీ, మారేడుమిల్లి అడవుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ పుష్ప 2కి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ని ఇచ్చింది.

పుష్ప సినిమా క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ అంటూ పోలీసు పాత్రలో వచ్చి మెప్పించారు ఫహద్ ఫాజిల్. పుష్ప పార్ట్ 1 లో చిన్న పాత్రే అయినా క్లైమాక్స్ మొత్తం ఫహద్ మీదే ఉండటంతో ఈ క్యారెక్టర్ బాగా పండింది. పుష్ప 2 లో మాత్రం షెకావత్ క్యారెక్టర్ ఎక్కువ లెంగ్త్ ఉంటుందని సమాచారం. తాజాగా సుకుమార్, ఫహద్ పుష్ప సెట్ లో ఉన్న ఓ ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి.. ఫహద్ ఫాజిల్ తో ఓ ముఖ్యమైన షూటింగ్ పార్ట్ పూర్తయింది. షెకావత్ సర్ ప్రతీకారంతో తిరిగొస్తున్నారు అని ట్వీట్ చేశారు.

Virupaksha : 100 కోట్ల క్లబ్ లోకి సుప్రీం హీరో ఎంట్రీ.. విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్స్..

షెకావత్ ప్రతీకారంతో పుష్ప కోసం వస్తున్నాడు అని చెప్పడంతో అల్లు అర్జున్, ఫహద్ మధ్య మరిన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. దీంతో బన్నీ అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక పుష్ప 2 సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అవుతుందని సమాచారం.