Pushpa: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో..

Pushpa: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో కూడా అదే తరహా వసూళ్లను రాబడుతూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఒకపక్క హిందీ మినహా మిగతా బాషలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చినా థియేటర్లలో కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.

ManiRathnam : సిద్ శ్రీరామ్ హీరోగా మణిరత్నం సినిమా??

ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలై 25 రోజులు గడుస్తున్నా హిందీలో రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే హిందీలో 80 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించిన పుష్ప ఇక్కడ రూ.100 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఊహించని విధంగా బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.

RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా పుష్ప నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ రెండు వారాల క్రితమే ట్వీట్ చేయగా ఇప్పుడు పుష్ప దాన్ని నిజం చేస్తుంది. బాలీవుడ్ సినిమా 83, హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ లాంటి చిత్రాలు ఉన్నప్పటికీ పుష్ప హౌజ్ ఫుల్ తో దూసుకు పోతుండటంతో సినిమా లాంగ్ రన్ లో మరింత ఎక్కువ వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. జనవరి 9 ఆదివారం మరోసారి హిందీలో పుష్పకి హౌస్ ఫుల్ బోర్డులు పడడం చూస్తే ఈ సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది.