Pushpa: మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో పుష్ప.. తగ్గేదే లే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ అందించారు. తాజాగా ఈ సినిమాకు ప్రతిష్టాత్మకమైన మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం దక్కింది.

Pushpa: మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో పుష్ప.. తగ్గేదే లే!

Allu Arjun Pushpa Movie Screened At Moscow International Film Festival

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ అందించారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ అవతారంలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీగా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Pushpa The Rule: పుష్పరాజ్.. మొదలుపెట్టేది అప్పుడే..?

ఇక రీసెంట్‌గా ఈ సినిమా సైమా అవార్డ్స్‌లో తన సత్తా చాటింది. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా గుర్తింపు దక్కుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు ప్రతిష్టాత్మకమైన మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం దక్కింది. ‘బ్లాక్‌బస్టర్ హిట్స్ ఫ్రం అరౌండ్ ది వరల్డ్’ విభాగంలో పుష్ప చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా ఇప్పుడు సత్తా చాటుతుండటంతో ఈ సినిమా మున్ముందు మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.