Allu Arjun: నో అంటే నో.. బన్నీ దెబ్బకు విలవిలలాడుతున్న కంపెనీలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప - ది రైజ్’ చిత్రంతో కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ఇండియావైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. దీన్నే క్యాష్ చేసుకోవాలని పలు యాడ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు పాన్ పరాగ్, డ్రింక్స్, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు బన్నీ ముందు భారీ ఆఫర్స్ పెడుతున్నాయి.

Allu Arjun: నో అంటే నో.. బన్నీ దెబ్బకు విలవిలలాడుతున్న కంపెనీలు!

Allu Arjun Rejects One More Ad

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప – ది రైజ్’ చిత్రంతో కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ఇండియావైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీతో బన్నీ స్టార్‌డమ్ మరింత పెరిగిపోయింది. దీన్నే క్యాష్ చేసుకోవాలని పలు యాడ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు పాన్ పరాగ్, డ్రింక్స్, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు బన్నీ ముందు భారీ ఆఫర్స్ పెడుతున్నాయి.

Allu Arjun: ‘బింబిసార’పై బన్నీ హాట్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

అయితే ఇటీవల ఓ పాన్ పరాగ్ కంపెనీ ఇచ్చిన భారీ ఆఫర్‌ను బన్నీ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన సంపాదనకంటే కూడా తన అభిమానుల ఆరోగ్యమే తనకు ముఖ్యమని బన్నీ ఈ విధంగా పాన్ పరాగ్ యాడ్‌కు నో చెప్పాడు. ఇక ఈ వార్త తెలుసుకుని పలువురు సెలబ్రిటీలు కూడా బన్నీ బాటలో వెళ్తున్నారు. అయితే తాజాగా మరోసారి బన్నీ తన మంచితనాన్ని చాటుకున్నాడు. మరో కంపెనీ కూడా తమ ప్రోడక్టులను ప్రమెట్ చేసేందుకు బన్నీకి ఏకంగా రూ.15 కోట్ల భారీ ఆఫర్‌ను ఇచ్చిందట.

Allu Arjun : ఐకాన్ స్టార్ మరో మాస్ లుక్.. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..

కానీ.. బన్నీ మాత్రం నో అంటే నో అని చెప్పడంతో సదరు కంపెనీ ఉక్కిరిబిక్కిరి అవుతుందట. బన్నీ నో చెప్పిన తమ ప్రోడక్టులను ఇండస్ట్రీలో ఎవరు ప్రమోట్ చేస్తారా అని వారు ఆలోచనలో పడ్డారట. ఏదేమైనా బన్నీ తీసుకుంటున్న నిర్ణాయలు ఆయన్ను ఫాలో అయ్యే అభిమానుల ఆరోగ్యాలను కాపాడేందుకే కావడంతో బన్నీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.