ఫ్యాన్స్ నన్ను ఫాలో అవ్వద్దు.. ప్లీజ్..: అల్లూ అర్జున్

10TV Telugu News

సెలబ్రిటీలు ఏదైనా చేస్తే దానిని చెయ్యడానికి ఆసక్తి కనబరుస్తుంటారు సామాన్యులు… సినిమా హీరోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మెగా హీరో, స్టైలీష్ స్టార్ గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అతనిని ఫాలో అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం తనను ఫాలో అవ్వద్లు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు అల్లూ అర్జున్. అసలు విషయం ఏమిటంటే.. 

సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అల్లూ అర్జున్. సంక్రాతికి వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా దూసుకెళ్తుంది. బాహుబలి కాకుండా అన్ని రికార్డులను తీరగరాస్తున్నాగు బన్నీ. ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా.. ఈసినిమా సక్సెస్ మీట్ జరిపింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలోనే అల్లూ అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బన్నీ చాలా స్టైల్‌గా పొగ తాగుతూ ఫైట్ చేస్తాడు. ఇది చూసి నిజంగానే అభిమానులు కూడా చాలా మంది సిగరెట్స్ తాగుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. అది బన్నీ వరకు  వెళ్లగా.. దీనిపై అభిమానులని రిక్వెస్ట్ చేశారు బన్నీ. పొగ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాడు.

తాము కేవలం సినిమాలో ఆ సన్నివేశం కోసం మాత్రమే అలా పొగ తాగాల్సి వచ్చింది కానీ నిజ జీవితంలో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని చెప్పాడు బన్నీ. దయచేసి ఆ ఒక్క సీన్‌లో తనను ఫాలో కావద్దని అభిమానులను రిక్వెస్ట్ చేశాడు.