బన్నీ మనసుని తాకిన ‘బుట్టబొమ్మ’ టిక్‌టాక్ వీడియో

తాజాగా అల్లు అర్జున్ షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : February 11, 2020 / 05:13 AM IST
బన్నీ మనసుని తాకిన ‘బుట్టబొమ్మ’ టిక్‌టాక్ వీడియో

తాజాగా అల్లు అర్జున్ షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల.. వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో పాటలు, వాటిలో బన్నీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి.

‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే’.. అంటూ సాగే మెలోడీ సాంగ్  క్లాస్‌ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BUNNY

 

ఇంతకీ ఈ వీడియోలో ఆడిపాడుతోంది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని వ్యక్తి ‘బుట్టబొమ్మ’ అంటూ డ్యాన్స్‌ చేయగా దానికి చేతులు లేని యువతి కాలు కదిపింది. దీనిపై బన్నీ స్పందిస్తూ ‘హార్ట్‌ టచింగ్‌ వీడియో.. సంగీతం మనిషి వైకల్యాన్ని మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో నిరూపించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

BUNNY

 

థమన్ ‘మై హార్ట్ గోస్ టు దిస్ వన్.. లవ్లీ వీడియో.. గాడ్ బ్లెస్’ అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి చేసిన సంగతి తెలిసిందే. థమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌రాయగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్‌లో మరింత ఫేమస్ అయ్యింది. 

SHILPA