icon star: స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్.. అంతే. గంగోత్రి, ఆర్య తర్వాత మూడో సినిమా బన్నీకే మెగాస్టార్ చిరంజీవి..

icon star: స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్

Allu Arjun

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్.. అంతే. గంగోత్రి, ఆర్య తర్వాత మూడో సినిమా బన్నీకే మెగాస్టార్ చిరంజీవి ఈ బిరుదు ఇచ్చేశారు. స్టైలిష్ స్టార్ నుంచి రేంజ్ పెంచుకున్న అల్లు అర్జున్ పొజిషన్‌కు.. మార్కెట్‌కు స్టైలిష్ స్టార్ అనే బిరుదు అసలు సెట్ అవడం లేదు. అందుకే బాగా ఆలోచించిన సుకుమార్.. సరైన బిరుదు సెట్ చేశాడు. ఇక నుంచి అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్.

పుష్ప సినిమా నుంచి బన్నీ పేరు ఇలాగే పడుతుంది. తాజాగా విడుదలైన పుట్టినరోజు టీజర్లో అల్లు అర్జున్ పేరు ముందు ఐకాన్ స్టార్ అని యాడ్ అయిపోయింది. అల్లు అర్జున్ పేరు ఇక మారిపోయింది అన్నమాట. ఇదే విషయాన్ని టీజర్ లాంచ్ వేడుకల్లో అల్లు అర్జున్ కూడా చెప్పాడు. తనను ఇప్పటినుంచి ఐకాన్ స్టార్ అంటుంటే ఆనందంగా ఉంది అని.. ఈ పేరు నిలబెట్టుకోవడానికి తాను ఇంకా చాలా కృషి చేస్తానని అంటున్నాడు.

పుష్ప టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోండగా.. ఇందులో అల్లు అర్జున్ లుక్‌తో పాటు విజువల్స్ కూడా కిరాక్ గా ఉంది. పుష్ప రాజ్ పాత్ర కోసం పూర్తిగా ప్రాణం పెట్టేసాడు బన్నీ. కచ్చితంగా రంగస్థలం కంటే పెద్ద హిట్ సినిమాతో సుకుమార్ అందుకునేలా కనిపిస్తున్నాడు. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతహ అనిపిస్తోంది.

కచ్చితంగా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈయనకు ఉత్తరాదిన అదిరిపోయే ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు హిందీలో అనువాదమై రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. నేరుగా పుష్ప సినిమాతో వాళ్ళ ముందుకు వెళుతున్నాడు బన్నీ. మరి ఈ ఐకాన్ స్టార్ పుష్ప ఏం చేస్తుందో తెలుసుకోవాలి.