Pushpa Trailer Tease : క్యారెక్టర్లు మామూలుగా లేవుగా..! పుష్ప ట్రైలర్ టీజ్

షార్ట్ కట్ లో 26 సెకన్లలో చూపించిన ట్రైలర్ టీజ్ లో ఇవే ఉన్నాయి. ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేదే......

Pushpa Trailer Tease : క్యారెక్టర్లు మామూలుగా లేవుగా..! పుష్ప ట్రైలర్ టీజ్

Pushpa Trailer Tease

Pushpa Trailer Tease : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న పుష్ప(Pushpa) మూవీ ట్రైలర్ టీజ్ రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ కు ముందు… అందులో ఏముందో చెప్పే గ్లింప్స్ తో.. ఈ ట్రైలర్ టీజ్ ను వదిలారు. యాక్షన్, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న పుష్ప ట్రైలర్ టీజ్ లో ఏముందో ఓసారి చూద్దాం.

26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో ఏముందంటే..?

కొండలు, గుట్టల మధ్య అడవిని ముందుగా చూపించారు. మాస్ గెటప్ లో అల్లు అర్జున్ ఎంట్రీ విజిల్స్ వేయిస్తుంది. ఓ పాము.. నీళ్లలో బైక్ ను గిర్రున తిప్పుతూ అల్లు అర్జున్ స్టంట్.. ఎర్రచందనం దుంగలు ఎత్తుకుపోవడం.. స్మగ్లర్ అల్లు అర్జున్ ను కట్టేసి కొట్టడం… చేజింగ్ లు.. కాల్పులు… ఈ మధ్యలో రష్మిక జిగేల్మనిపించేలా బైక్ రైడ్.. స్మగ్లింగ్ కు రాజకీయాలకు లింక్… విలన్ ఫహాద్ ఫాజిల్.. సునీల్… బ్లేడ్ తో ప్రాణం తీసే అనసూయ.. బీరు బాటిళ్లతో పుష్ప బ్యాచ్ ఎంజాయ్ మెంట్… చివర్లో అల్లు అర్జున్ మెరుపులాంటి జంప్. షార్ట్ కట్ లో 26 సెకన్లలో చూపించిన ట్రైలర్ టీజ్ లో ఇవే ఉన్నాయి. ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేదే అన్న ఫీల్ ను తెప్పించారు.

Also Read : Omicron-RRR : ఏ వేరియంట్ వచ్చినా థియేటర్లు నడుస్తాయ్- మంత్రి తలసాని

పుష్ప ఫుల్ ట్రైలర్ ను డిసెంబర్ ఆరున రిలీజ్ చేయబోతున్నారు. మూవీని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. మొత్తం ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో పుష్ప మూవీ రిలీజ్ కానుంది. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిరిస్తున్న ఈ మూవీలో “పుష్ప- ది రైజ్” ఫస్ట్ పార్ట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత మ్యూజిక్ అందించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్