కూతురుతో బన్నీ : నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లిచేసుకో నాన్నా..

కూతురితో అల్లు అర్జున్ అల్లరి.

  • Published By: sekhar ,Published On : February 8, 2019 / 09:59 AM IST
కూతురుతో బన్నీ : నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లిచేసుకో నాన్నా..

కూతురితో అల్లు అర్జున్ అల్లరి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్న, ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం ఇంటికెళ్ళి, ఆయణ్ణి పరామర్శించాడు. బన్నీ, బ్రహ్మానందం కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే, బన్నీ లేటెస్ట్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో షికారు చేస్తుంది. ఆ వీడియోలో, తన కూతురితో కలిసి ఓ రేంజ్‌లో అల్లరి చేసాడు బన్నీ. వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఇంతకీ ఆ వీడియోలో బన్నీ, అర్హతో ఏం చెప్పించాడో తెలుసా?

నాన్నా, నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాను.. అని తను చెప్తూ, పాపతో చెప్పించాడు. తర్వాత అర్హని చేసుకుంటావా? అనడిగితే, చేసుకోను అనేసింది. వెంటనే బన్నీ, చేసుకోవా? దొంగ ఫెలో.. అంటూ, అర్హని పైకెత్తి, చేసుకుంటాను అని చెప్పు అంటే, అర్హ.. చేసుకోను అనేసింది. రెండు, మూడు సార్లడిగినా అలానే చెప్పింది. చివరకి, నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకో నాన్నా ప్లీజ్.. అన్నాసరే, అర్హ చేసుకోను అనే చెప్పింది. తండ్రీ, కూతుళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి శాంపుల్‌లా ఉందీ వీడియో. బన్నీ ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ వీడియోని లైక్ చేస్తూ, కామెంట్స్ పెడుతూ, షేర్ చేస్తున్నారు.   

వాచ్ వీడియో…