Allu Arjun: మళ్లీ రేసు మొదలుపెడతానంటోన్న బన్నీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ‘పుష్ప-1’ను తెరకెక్కించిన బన్నీ, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పుష్ప-2’ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈసారి ‘పుష్ప-2’ను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ చాలా టైమ్ కూడా తీసుకుంటుంది.

Allu Arjun: మళ్లీ రేసు మొదలుపెడతానంటోన్న బన్నీ..?

Allu Arjun To Do One More Movie With Surender Reddy

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ‘పుష్ప-1’ను తెరకెక్కించిన బన్నీ, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పుష్ప-2’ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈసారి ‘పుష్ప-2’ను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ చాలా టైమ్ కూడా తీసుకుంటుంది.

Allu Arjun : అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ఐకాన్ స్టార్ మీటింగ్.. ఎందుకో?

అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలనే విషయంపై బన్నీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. బన్నీకి గతంలో ‘రేసుగుర్రం’తో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మరోసారి సినిమా చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడట. ఇప్పటికే సురేందర్ రెడ్డి బన్నీకి ఓ స్టోరీలైన్ వినిపించగా, అది నచ్చిన బన్నీ, తాను పుష్ప-2 ముగించే సమయానికి ఆ కథను పూర్తిగా డెవలప్ చేయమని కోరాడట. దీంతో సురేందర్ రెడ్డి కూడా అందుకు ఓకే చెప్పాడట.

Allu Arjun : టాలీవుడ్ నుంచి ఆ అవార్డు అందుకున్న మొదటి నటుడు అల్లు అర్జున్..

ఇక పుష్ప-2 తరువాత బన్నీకి గనక సురేందర్ రెడ్డి చెప్పే కథ నచ్చితే, బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్లాక్‌బస్టర్ కోసం బన్నీ రేసు మొదలుపెట్టడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే సురేందర్ రెడ్డి చెప్పే కథ నచ్చితేనే బన్నీ ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతాడు. కాగా, ప్రస్తుతం సురేందర్ రెడ్డి యంగ్ హీరో అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీని రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిజంగానే మరోసారి బన్నీ-సురేందర్ రెడ్డి కాంబో సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.