కాంబో కుదిరిందా.. బన్నీ లైనప్ అదిరిందిగా!..

  • Published By: sekhar ,Published On : July 17, 2020 / 12:58 PM IST
కాంబో కుదిరిందా.. బన్నీ లైనప్ అదిరిందిగా!..

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు భలే ఆసకరంగా ఉంటాయి. కొందరు హీరోలు ఫలానా దర్శకుడితో పని చేయాలని, కొందరు దర్శకులు ఫలానా హీరోతో సినిమా చేయాలని ఎదురుచూస్తుంటారు. ఇక క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడం కోసం నిర్మాతలు మామూలు పాట్లు పడరు. ఈ హీరో, ఈ డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా.. అని ప్రకటించగానే అడ్వాన్సులు, సినిమా పూజ నాటికే బిజినెస్ జరిగిన సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా అటువంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబో ఒకటి సెట్ అయిందనే వార్త ఫిలిం వర్గాల్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది.

Siva-Bunny

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మొదలుపెట్టాడో కానీ శివకు దాదాపు రెండేళ్ల సమయం వృధా అయిపోయింది. మరో ఆరు నెలలకైనా ‘ఆచార్య’ పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఒప్పుకున్న పెళ్లికి వాయించకతప్పుతుందా అన్నట్టు తయారైంది శివ సిచ్యుయేషన్..

Acharya

తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేస్తాడని లేదు ఇంకో మీడియం హీరో అని వార్తలు వచ్చాయి కానీ శివ తన తర్వాతి సినిమాని బన్నీతో ఫిక్స్ చేశాడని అంటున్నారు. బన్నీ కూడా ‘పుష్ప’ పూర్తయిన తర్వాత శివ, త్రివిక్రమ్ సినిమాలను లైన్లో పెట్టాడని ఫిలింనగర్ టాక్. మరికొద్ది రోజుల్లో బన్నీ, శివ కలయికలో సినిమాపై క్లారిటీ రానుంది.