Allu Arjun : క్రేజీ కాంబో.. విశ్వక్ సేన్ లవ్ స్టోరీలో బన్నీ..

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు..

Allu Arjun : క్రేజీ కాంబో.. విశ్వక్ సేన్ లవ్ స్టోరీలో బన్నీ..

Allu Arjun

Allu Arjun: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ అదిరిపోయే కాంబో గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ ‘ఓ మై కడవులే’.. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీ క్యారెక్టర్ చేశారు.

Oh My Kadavule

ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతోంది. ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ చెయ్యబోతున్నారని తెలుస్తుంది. మేకర్స్ ఇప్పటికే బన్నీని కలవగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..

చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లడం, చివరకు వాళ్లు విడిపోయారా.. తిరిగి ఒక్కటయ్యారా అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ‘ఓ మై కడవులే’ తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఆ పాత్రలోనే అల్లు అర్జున్ కనిపించనున్నారు.