Allu Arjun: షారుక్ సినిమాలో తగ్గేదే లే అంటోన్న బన్నీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ మూవీతో యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను సాధించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తనదైన మ్యానరిజంతో బన్నీ అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఇక పుష్పరాజ్ పాత్రను యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపులు పుష్ప-2 మూవీపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశాడు బన్నీ. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టైలిష్ స్టార్.

Allu Arjun: షారుక్ సినిమాలో తగ్గేదే లే అంటోన్న బన్నీ..?

Allu Arjun To Star In Shah Rukh Khan Jawan Movie

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ మూవీతో యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను సాధించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తనదైన మ్యానరిజంతో బన్నీ అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఇక పుష్పరాజ్ పాత్రను యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపులు పుష్ప-2 మూవీపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశాడు బన్నీ. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టైలిష్ స్టార్.

Allu Arjun : వికలాంగ అభిమానిని ఎత్తుకొని ఫొటో ఇచ్చిన బన్నీ..

అయితే ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న సినిమాలోనూ బన్నీ అదరగొట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా బిటౌన్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇటీవల పఠాన్ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ సినిమాతో చాలా కాలం తరువాత షారుక్ బొంబాట్ హిట్ అందుకుని అభిమానుల ఆకలి తీర్చాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ హీరో. తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Allu Arjun : పుష్పరాజ్‌కి లారీ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అయాన్..

కాగా, ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కేమియో పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించాల్సిందిగా బన్నీని కోరాడట. అయితే దీనిపై బన్నీ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదట. జవాన్ సినిమాలో అట్లీ వివరించిన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో బన్నీ ఈ సినిమాలో కేమియో చేసే అవకాశం ఎక్కువగా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఈ సినిమాలో బన్నీ కేమియో చేస్తే మాత్రం ఆయన క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు చేరుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక జవాన్ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.