Allu Aravind : అల్లు అర్జున్ ఆ థియేటర్లోనే ముసుగు వేసుకొని సినిమా చూస్తాడు..

తాజాగా నిర్వహించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ బన్నీ గురించి మాట్లాడుతూ.. ''బన్నీ రెండు వారాలు విదేశాలకు వెళ్లి నిన్నే ఇంటికి వచ్చాడు. F3 సినిమా చూడాలని.............

Allu Aravind : అల్లు అర్జున్ ఆ థియేటర్లోనే ముసుగు వేసుకొని సినిమా చూస్తాడు..

Allu Arjun

Allu Arjun :  హీరోలు ఎక్కడికైనా వస్తే అభిమానుల కోలాహలం ఎలా ఉంటదో అందరికి తెలిసిందే. దీంతో హీరోలు, సెలబ్రిటీలు ఎక్కడికన్నా బయటకి వెళ్లి మామూలు ప్రజల్లా ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టమే. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక మామూలు ప్రజల్లా చేసే ఎంజాయ్ వదులుకోవాల్సిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మేము ఎందుకు ఎంజాయిమెంట్ ని వదులుకోవాలని ఎక్కడికన్నా వెళితే ముసుగు వేసుకొని వెళ్లి వస్తూ ఉంటారు.

ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి హైదరాబాద్ లోని ఓ థియేటర్ కి ముసుగు వేసుకొని వెళ్లి సినిమా చూసిన సంగతి తెలిసిందే. సినిమా చూసి బయటకి వస్తుంటే కొంతమంది గుర్తుపట్టి ఫోటోలు వీడియోలు తీయగా అవి వైరల్ గా మారాయి. తాజాగా అల్లు అర్జున్ కూడా ఇలాగే ముసుగు వేసుకొని సినిమాలకి వెళ్లి వస్తాడు అని చెప్పారు అల్లు అరవింద్.

Hollywood : ఇండియా మీద హాలీవుడ్ దండయాత్ర.. భయపడుతున్న బాలీవుడ్..

తాజాగా నిర్వహించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ బన్నీ గురించి మాట్లాడుతూ.. ”బన్నీ రెండు వారాలు విదేశాలకు వెళ్లి నిన్నే ఇంటికి వచ్చాడు. F3 సినిమా చూడాలని ఇంట్లో ఉన్న క్యూబ్ ఆన్ చేయబోతే థియేటర్‌కు వెళ్లి చూడమని చెప్పాను. నిన్న రాత్రే F3 సినిమాకు కూకట్‌పల్లిలో ఉన్న ఓ థియేటర్ కి వెళ్లి ఉంటాడు. ప్రతిసారి బన్నీ సినిమాకి వెళ్లాలంటే అక్కడికే వెళ్తాడు. సినిమా స్టార్ట్ అయ్యాక ముసుగు వేసుకుని లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఇంటర్వెల్‌లో కొంచెం ముందే బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లి సినిమా మొత్తం చూసి ముసుగేసుకుని బయటకి వచ్చేస్తాడు. ఇలా సినిమాలు అప్పుడప్పుడు కూకట్పల్లి థియేటర్స్ కి వెళ్లి చూస్తాడు” అని తెలిపారు. దీంతో బన్నీ అభిమానులు ఈ సారి కూకట్పల్లి థియేటర్స్ కి వెళితే బాగా పరిశీలించాలని ఫిక్స్ అయ్యారు.