Most Eligible Bachelor : అఖిల్ కోసం అల్లు అర్జున్

అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ ఫంక్షన్‌కి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు..

10TV Telugu News

Most Eligible Bachelor: యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా ఫస్ట్ హిట్ కొట్టాడు. కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తుండడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యిందీ సినిమా. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. హౌస్‌ఫుల్ బోర్డులతో, భారీ కలెక్షన్లతో బొమ్మ సూపర్ హిట్ అనేసారు ప్రేక్షకులు. అఖిల్ ఫర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడని అంటున్నారు అంతా.

Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

ఆదివారం వైజాగ్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించిన టీం.. హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఫంక్షన్‌కి ఛీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. అక్టోబర్ 19 సాయంత్రం ఆరు గంటల నుండి జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ మీట్ జరుగనుంది.