Allu Arjun : ఇప్పటి వరకూ స్టైల్ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. బట్.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్.

Allu Arjun : ఇప్పటి వరకూ స్టైల్ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క

pushpa Film function

Different Style : సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. బట్.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్. మాస్ ఫ్యాన్స్ కి బన్నీకి మించిన హీరోలేడనేలా, క్లాస్ కి అదే లెవల్లో క్లాసీనెస్ ని చూపించేలా తనను తాను మౌల్డ్ చేసుకున్న బన్నీ.. డ్యాన్స్ లో తనకు ఎదురు లేదని ప్రూవ్ చేసుకున్నారు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న బన్నీ..ఇప్పుడిప్పుడే ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ..తనకు తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కెరీర్లో అల్లు అర్జున్ స్టైలిష్ క్యారెక్టర్లతోనే ఎక్కువగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో ఫస్ట్ టైమ్ మాస్..ఊరమాస్ క్యారెక్టర్లో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. స్టైల్ ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా, స్టైలిష్ స్టార్ అన్న పేరు మర్చిపోయే గెటప్ లో కనిపిస్తున్నారు అల్లు అర్జున్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఊరమాస్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు బన్నీ. పుష్పరాజ్ గా నెవర్ బి ఫోర్ లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు అల్లు అర్జున్.

టాలీవుడ్ కి తన మార్క్ స్టైల్ స్టేట్ మెంట్స్ ని ఇస్తూ.. అందరిలో స్పెషల్ అనిపించుకుంటున్న బన్నీ, ఫస్ట్ నుంచి తన ఈజ్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. కెరీర్లో ఎక్స్ పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీ గా ఉండే బన్నీ.. కరెక్ట్ స్టోరీ దొరకే వరకూ టైమ్ తీసుకుంటారు. ‘అల వైకుంఠపురం’లో సినిమాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు బన్నీ. అయితే ఈ సక్సెస్ కి ముందు దాదాపు సంవత్సరం న్నరకు పైగానే గ్యాప్ తీసుకున్నారు. వరుసగా వస్తున్న ఫ్లాపులనుంచి సొల్యూషన్ వెతుక్కుని సూపర్ హిట్ కొట్టారు బన్నీ.

ఎంత పెద్ద స్టార్ అయినా సింపుల్ గా ఉండే ఆ డైలాగ్ డెలివరీ, స్టోరీ సెలక్షన్ తో పడేశారు ఫ్యాన్స్ ని. జులాయి గా ఇంటెలెక్చువల్ గా కనిపించినా, బ్రదీ నాథ్ లో రెలిజియస్ ఎమోషన్స్ చూపించినా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సెంటిమెంట్ తో టచ్ చేసినా.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో టఫ్ కాప్ గా సెటిల్డ్ యాక్టింగ్ చేసినా .. అన్నింటికీ యాప్ట్ అనిపించారు బన్నీ. ఇలా సినిమా సినిమాకీ యాక్టింగ్ వైజ్, క్యారెక్టర్ వైజ్, అప్పియరెన్స్ వైజ్ వేరియేషన్స్ చూపిస్తూ.. ఇంప్రొవైజ్ అవుతూ కెరీర్ ని స్పీడప్ చేస్తూ మెగా ఇమేజ్ ని ఇంకా బిల్డప్ చేస్తున్నారు బన్నీ.

Read More : Allu Arjun: స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్