అల్లు అర్జున్ అంటే అభిమానం కాదు.. అంతకుమించి..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ఫ్యాన్ ఒంటినిండా టాటూలు, ఇంటినిండా బన్నీ ఫోటోలతో నింపేశాడు..

  • Published By: sekhar ,Published On : March 13, 2020 / 07:02 AM IST
అల్లు అర్జున్ అంటే అభిమానం కాదు.. అంతకుమించి..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ఫ్యాన్ ఒంటినిండా టాటూలు, ఇంటినిండా బన్నీ ఫోటోలతో నింపేశాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి యూత్‌లో మామూలు ఫాలోయింగ్ లేదు. బన్నీ క్రేజ్ కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాలేదు. కేరళలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ మనోడికి మల్లు అర్జున్ అనే పేరు కూడా పెట్టేశారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే కేరళకు చెందిన సుజిత్ అనే క్రేజీ ఫ్యాన్ బన్నీ అంటే తనకి ఎంతిష్టమో తెలుపుతూ ఒంటి నిండా 13చోట్ల స్టైలిష్‌ స్టార్‌ ఫోటోలతో.. 19 చోట్ల అల్లు అర్జున్‌ పేర్లతో పచ్చబొట్లు.. ఇక అతని గదినిండా సుమారు 50వేల వరకు అల్లు అర్జున్‌ ఫోటోలు.. అభిమానానికి కొలమానం లేదన్నట్లుగా ఆ యువకుడు తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ ఫోటోలతో ఇల్లంతా నింపేశాడు. తలుపులు, కిటికీలు, గోడలు, సీలింగ్, ఫ్యాన్లు ఇలా దేన్నీ వదల్లేదు. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ బన్నీ ఫోటోలు అతికించేసాడు.

చూశారుగా బన్నీకి ఇతను ఎంతటి వీరాభిమానో .. మనోడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. గతంలో బన్నీని కలిసి తన దగ్గరున్న రేర్ ఫోటో కలెక్షన్ చూపించి తనతో ఫోటో కూడా దిగాడు. సుజిత్ తన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Allu Arjun's Fan

 

Bunny

Read Also : ‘ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి? కంటెస్టెంట్‌ని బండ బూతులు తిట్టిన నేహా..