Allu Arjun : పుష్పరాజ్‌కి లారీ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అయాన్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కనిపించిన సంగతి మనకి తెలిసిందే. దీంతో అల్లు అయాన్.. పుష్పరాజ్ కోసం ఒక లారీని బహుమతిగా ఇచ్చాడు.

Allu Arjun : పుష్పరాజ్‌కి లారీ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అయాన్..

Allu Ayaan gifted lorry to allu arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ నటన అద్భుతం. తన మాట, తన మ్యానరిజం.. ఇలా సినిమాలో అల్లు అర్జున్ చేసిన ప్రతిదీ ఆకట్టుకుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఇండియా వైడ్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Allu Arjun : అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా.. థ్యాంక్ యు దుబాయ్ అంటూ స్పెషల్ పోస్ట్..

ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ కి తన కొడుకు అల్లు అయాన్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కనిపించిన సంగతి మనకి తెలిసిందే. దీంతో అల్లు అయాన్.. పుష్పరాజ్ కోసం ఒక లారీని బహుమతిగా ఇచ్చాడు. లారీ అంటే నిజమైన లారీ అనుకోకండి. ఒక బొమ్మ లారీని తన తండ్రికి ప్రేమతో గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ బహుమతిని ఫోటో తీసి అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ.. మా ప్రియమైన చిన్నబాబు అయాన్ నుంచి ఒక ప్రేమ బహుమతి అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

కాగా పుష్ప-2 షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం వైజాగ్ లో సాంగ్ షూట్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తి చేసేశాడట. దీంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే పనిలో ఉన్నాడట. వాల్తేరు వీరయ్య సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేయడంతో ఈ మూవీలో దేవిశ్రీ BGM పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)