Allu Sneha Reddy: ఆహా.. అల్లు వారి కోడలి విన్యాసాలు భేష్!

సినీ సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఫిట్నెస్ మీద ఎంతో దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. రోజువారీ కసరత్తులుకు తోడు యోగాసనాలు చేస్తూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. వీరిలో హీరో, హీరోయిన్స్ ఉండడం సహజమే కాగా హీరోల భార్యలు అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం చాలా తక్కువే.

Allu Sneha Reddy: ఆహా.. అల్లు వారి కోడలి విన్యాసాలు భేష్!

Allu Sneha Reddy

Allu Sneha Reddy: సినీ సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఫిట్నెస్ మీద ఎంతో దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. రోజువారీ కసరత్తులుకు తోడు యోగాసనాలు చేస్తూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. వీరిలో హీరో, హీరోయిన్స్ ఉండడం సహజమే కాగా హీరోల భార్యలు అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం చాలా తక్కువే. వీరిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే దేశంలో ఏ స్టార్ హీరో భార్యకు లేని ఫాలోయింగ్ స్నేహా సొంతం.

ఈ మధ్యే ఇన్ స్టాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న స్నేహారెడ్డి బన్నీ, అర్హ, అయాన్‌లకు సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్‌లు ఇస్తుంటారు. స్నేహారెడ్డి షేర్ చేసే ఫోటోలు, వేసే సెటైర్లు, చేసే కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా తాజాగా ఆమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. స్నేహా రెడ్డి కొన్నాళ్లుగా యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

కాగా.. ఎట్ట‌కేల‌కు స్నేహా ఆ ఫీట్ సాధించారు. త‌న సోష‌ల్ మీడియాలో ఈ ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయ‌గా.. స్పందించిన క‌ళ్యాణ్ దేవ్ మొత్తానికి సాధించావు అని రిప్లై ఇచ్చారు. గ‌తంలో ఇలాంటి ఫీట్స్ ఆదాశ‌ర్మ‌తో పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా చేయగా.. ఇలా ఓ స్టార్ హీరో భార్య కూడా ఇలా యోగాసనాలు, ఫిట్నెస్ తో అదరగొట్టడం స్నేహకే చెల్లగా.. స్నేహ విన్యాసనాలకు నెటిజన్లు భేష్ అంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)