విశాల విస్తీర్ణంలో ‘అల్లు స్టూడియోస్’.. వీడియో చూశారా!..

  • Edited By: sekhar , October 2, 2020 / 07:03 PM IST
విశాల విస్తీర్ణంలో ‘అల్లు స్టూడియోస్’.. వీడియో చూశారా!..

Allu Studios: తెలుగు తెర‌పై హ‌స్య‌పు జ‌ల్లు అల్లు అనే నానుడికి తెరతీసిన పద్మశ్రీ.. శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారి 99వ జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ.. అల్లు స్ఫూర్తితో సినీ రంగప్రవేశం చేసిన తాము ఆయన లెగసీను కంటిన్యూ చేస్తూ వారి జ్ఞాపకార్థం ‘అల్లు స్టూడియోస్’ ను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Allu Family

నానక్‌ రామ్‌గూడ ఏరియాలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీవీ, సినిమా షూటింగులకు అనుగుణంగా.. అత్యంత ఆధునిక హంగులతో ఈ స్టూడియోను తీర్చిదిద్దనున్నారు.




వచ్చే ఏడాది అల్లు శత జయంతి సందర్భంగా ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభించే దిశగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు బాబీ(వెంకటేష్), అల్లు శిరీష్, స్నేహా రెడ్డి, అర్హ తదితరులు పాల్గొన్నారు.