Allu Studios: అల్లు వారి స్టూడియో.. తెరుచుకునేది అప్పుడేనా..?

టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని అల్లు ఫ్యామిలీ గతంలో ఓ భారీ అనౌన్స్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ‘అల్లు స్టూడియోస్’ పేరిట ఓ ఫిల్మ్ మేకింగ్ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించబోతున్నట్లు వారు ప్రకటించారు. అయితే తాజాగా ఈ అల్లు స్టూడియోస్ లాంఛ్ చేసేందుకు అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Allu Studios: అల్లు వారి స్టూడియో.. తెరుచుకునేది అప్పుడేనా..?

Allu Studios To Be Launched In October

Allu Studios: టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని అల్లు ఫ్యామిలీ గతంలో ఓ భారీ అనౌన్స్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ‘అల్లు స్టూడియోస్’ పేరిట ఓ ఫిల్మ్ మేకింగ్ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించబోతున్నట్లు వారు ప్రకటించారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫిల్మ్ స్టూడియోను గండిపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ అల్లు స్టూడియోస్ గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Allu Studios: అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘అల్లు ఫిల్మ్ స్టూడియోస్’ ప్రారంభం..

ఈ స్టూడియోను లాంఛ్ చేసేందుకు అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న ఈ స్టూడియోను అంగరంగ వైభవంగా లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ లాంఛ్ ఈవెంట్ కు ఓ స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ రావాల్సి ఉంది. ఫిల్మ్ మేకింగ్‌కు కావాల్సిన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో ఈ స్టూడియోను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ స్టూడియోను 10 ఎకరాల్లో నిర్మించగా, ఈ స్టూడియో వ్యవహారాలను అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్, శిరీష్, అల్లు బాబీలు కలిసి చూసుకుంటారని తెలుస్తోంది.

Allu Aravind: మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న అల్లు అరవింద్.. త్వరలో రాబోతున్నట్టు ప్రకటన!

కాగా, ఈ స్టూడియోను ప్రారంభించిన తరువాత ఇందులో షూటింగ్ జరుపుకునేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ స్టూడియోలో చిత్రీకరించాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగానే అక్టోబర్ 1న అల్లు వారి స్టూడియోను ప్రారంభిస్తారా అనేది చూడాలి.