హ్యాపీ బర్త్ డే హీరో : అల్లు అర్జున్ కనబడుటలేదు

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 04:28 AM IST
హ్యాపీ బర్త్ డే హీరో : అల్లు అర్జున్ కనబడుటలేదు

హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.. మెనీమెనీ మోర్ రిటర్న్స్ అంటోంది సినీ ఇండస్ట్రీ. అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బర్త్ డేకు స్పెషల్ ఉంటుందని నాలుగు రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు. అనుకున్నట్లుగానే కొత్త సినిమా ప్రకటించేశాడు అల్లు.

ఏప్రిల్ 8వ తేదీన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు అల్లు అర్జున్. MCA మూవీ డైరెక్టర్ వేణుతో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వెల్లడించాడు బన్నీ. నిర్మాత దిల్ రాజు. టైటిల్ : ఐకాన్.. క్యాప్షన్ కనబడుటలేదు అని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంది. హ్యాపీ బర్త్ డే AA విషెస్ చెబుతూ.. ICON – కనబడుటలేదు అని టైటిల్ ఉంటుంది. రోడ్డుపై హీరో బైక్ పై వెళుతుండటం.. బ్యాగ్రౌండ్ లో సూర్యుడు బొమ్మ చూస్తుంటే ఏదో డిఫరెంట్ స్టోరీ అయ్యి ఉంటుందని కచ్చితంగా చెబుతోంది స్టోరీ.

2018 సంవత్సరంలో ఒక్క సినిమాతో ముగించిన బన్నీ..ఈ ఏడాది వరస పెట్టి సినిమాలు చేయబోతున్నాడంట. ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే’ సినిమాలను నిర్మించిన ‘దిల్’ రాజుతో ‘అల్లు అర్జున్’ జత కలిశాడు. ‘ఏంసీఏ – మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఫేమ్ వేణు శ్రీరాం దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.