RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై న్యాయ పోరాటం చేస్తాం..

తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు ఈ సినిమాపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట........

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై న్యాయ పోరాటం చేస్తాం..

Alluri

 

RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ లతో పాటు వివిధ భాషల స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది.

 

ఇప్పటికే సినిమాపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొంతమంది కోర్టులో ఈ సినిమాపై కేసు వేయగా హైకోర్టు దానిని కొట్టేసింది. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు ఈ సినిమాపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ తాజాగా ఈ సినిమాపై మీడియాతో మాట్లాడారు.

గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. ”అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ చరిత్రని వక్రీకరిస్తున్నారు. గాంధీ ఆయుధాలు పట్టి బ్రిటీష్‌ వాళ్లపై పోరాటం చేశారని, నేతాజీతో కలిసి ఉద్యమాలు చేశారని సినిమా తీయగలరా?, డబ్బు కోసం చరిత్రని వక్రీకరిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో చరిత్ర వక్రీకరణపై న్యాయపోరాటం చేస్తాము. సినిమాలోని పాత్రల పేర్లని తొలిగించాలని” అన్నారు. అయితే ఈయన గతంలోనూ సినిమా చిత్రీకరణ సమయంలో స్క్రిప్ట్‌పై అభ్యంతరాలు తెలిపారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

మరోవైపు అల్లూరి సంఘం కూడా ఈ సినిమా చిత్రీకరణపై విమర్శలు గుప్పించింది. ”డబ్బులు, కమర్షియల్ అంశాల కోసం ఓ సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టగా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న కాల్పుల్లో వీరమరణం పొందారు. కొమురం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ ఇద్దరికి పరిచయం ఉన్నట్లు కానీ, స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని, అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్ధతి కాదు” అంటూ తెలిపారు.

NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

అయితే ఇప్పటికే అనేకసార్లు రాజమౌళి ఇది కేవలం కల్పిత కథ అని, వారిద్దరి క్యారెక్టర్స్ ని మాత్రమే రిఫరెన్స్ గా తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ఎంతో కాలంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇలాంటి వివాదాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడాలి అని, ఇది కేవలం కల్పిత కథ అని రాజమౌళి చెప్పిన తర్వాత కూడా ఇలాంటి వివాదాలు తగవని అభిమానులు అంటున్నారు. మరి తాజాగా వచ్చిన ఈ ఆరోపణలపై రాజమౌళి టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.