Alt Balaji : పేరు మార్చుకున్న ఓటీటీ.. తప్పుకున్న కంపెనీ హెడ్స్..

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కి చెందిన ఓటీటీ కూడా ఉంది. ఆల్ట్ బాలాజీ పేరుతో ఇది రన్ అవుతుంది. ఈ ఓటీటీలో నార్మల్ సినిమాలు, సిరీస్ లతో పాటు బోల్డ్, రొమాంటిక్, 18+ సినిమాలు, సిరీస్ లు కూడా ఉంటాయి. 18+ కంటెంట్ కూడా ఉండటంతో ఈ ఓటీటీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. ఆల్ట్ బాలాజీ హెడ్స్ గా..................

Alt Balaji : పేరు మార్చుకున్న ఓటీటీ.. తప్పుకున్న కంపెనీ హెడ్స్..

Alt Balaji ott name changed and appointed new heads in the place of ekta kapoor

Alt Balaji :  కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీకి చాలా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సినిమాలు, సిరీస్ లు, షోలతో పలు ఓటీటీలు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా టాప్ ఓటీటీలు ఇండియాలో మార్కెట్ క్రియేట్ చేసుకొని రన్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నిప్లస్ హాట్ స్టార్, జీ 5, సోని లివ్, MX ప్లేయర్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ఊట్, సన్ నెక్స్ట్, ఈరోస్ నౌ.. ఇలా అనేక రకాల ఓటీటీలు మన దేశంలో ప్రేక్షకులకి అందుబాటులో ఉన్నాయి.

వీటిల్లో బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కి చెందిన ఓటీటీ కూడా ఉంది. ఆల్ట్ బాలాజీ పేరుతో ఇది రన్ అవుతుంది. ఈ ఓటీటీలో నార్మల్ సినిమాలు, సిరీస్ లతో పాటు బోల్డ్, రొమాంటిక్, 18+ సినిమాలు, సిరీస్ లు కూడా ఉంటాయి. 18+ కంటెంట్ కూడా ఉండటంతో ఈ ఓటీటీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. ఆల్ట్ బాలాజీ హెడ్స్ గా ఇన్నాళ్లు నిర్మాత ఏక్తా కపూర్, ఏక్తా కపూర్ తల్లి శోభా కపూర్ లు ఉన్నారు. బాలాజీ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఈ ఓటీటీ నడుస్తుంది. తాజాగా ఆల్ట్ బాలాజీ ఓటీటీ హెడ్స్ గా ఏక్తా కపూర్, శోభా కపూర్ తప్పుకున్నట్టు, కొత్త బిజినెస్ హెడ్ గా వివేక్ కోకాని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు.

Tamannaah : కోయంబత్తూర్ లో తమన్నా పూజలు.. లింగ భైరవి అమ్మవారి గురించి గొప్పగా చెప్తూ వీడియో..

ఓటీటీ హెడ్స్ లో మార్పులు రాగానే ఈ ఓటీటీ పేరు కూడా మార్చేయడం విశేషం. ఆల్ట్ బాలాజీ అని ఉన్న ఈ ఓటీటీ పేరుని ఆల్ట్ (ALTT) గా మార్చారు. పేరు మారుస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఆల్ట్ ఓటీటీలో మరిన్ని కొత్త సిరీస్ లు, సినిమాల నిర్మాణం మొదలుపెట్టి ప్రేక్షకులకు అందిస్తామని కొత్త మేనేజ్మెంట్ తెలిపింది.