ఆమె పెళ్లి నిజం కాదంది.. ఈమె అంట్లు తోమింది.. ఆయన మేనల్లుడితో కలిసి ఫామ్‌లో..

కరోనా ఎఫెక్ట్ : ఇంటి పనులు, తోట పనులతో బిజీగా గడుపుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు..

  • Published By: sekhar ,Published On : March 24, 2020 / 01:17 PM IST
ఆమె పెళ్లి నిజం కాదంది.. ఈమె అంట్లు తోమింది.. ఆయన మేనల్లుడితో కలిసి ఫామ్‌లో..

కరోనా ఎఫెక్ట్ : ఇంటి పనులు, తోట పనులతో బిజీగా గడుపుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు..

అమలా పాల్ ముంబై సింగర్ భవ్నీందర్‌ సింగ్‌ను రహస్యంగా వివాహం చేసుకుందంటూ తాజాగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల గురించి తాజాగా ఓ తమిళ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల స్పందించింది. తను రెండో పెళ్లి చేసుకున్నానన్న వార్త నిజం కాదని స్పష్టం చేసింది. తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ కోసం రూపొందించిన యాడ్ సందర్భంగా ఆ ఫోటోలు తీశారని, రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. అమల మాటలు విన్న నెటిజన్స్.. యాడ్‌లో లిప్ లాక్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

katrina kaif busy with home chores

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరికి వారు తమకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ కూడా ఇంట్లో తను సరదగా గడుపుతున్న వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. గతంలో తను వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేయగా.. తాజాగా గిన్నెలు కడుగుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను అభిమానులతో పంచుకుంది.

salman khan busy nephew form

ఇక సల్మాన్‌ ఖాన్‌ తన మేనల్లుడు ఆహిల్‌ శర్మతో కలిసి ఫామ్‌లో సందడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫామ్‌లో  తిరుగుతూ చెట్ల పండ్లను కోస్తూ ఆహిల్‌కు అందిస్తుంటే.. ఆహిల్‌ ఎగ్జైట్ అవుతున్నాడు. ఈ వీడియో చూసి ‘ఆహిల్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక అర్జున్‌కపూర్‌, అనన్య పాండేలతో పాటు ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

? +?=?? really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome

A post shared by Katrina Kaif (@katrinakaif) on