Yash : KGF 2 ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే.. వర్కౌట్ అవుతుందా??
KGF, RRR సినిమాలు భారీ విజయం సాధించడంతో వీటికి ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాలనే కాన్సెప్టుతో వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ చాఫ్టర్ 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో...................

Kgf2
KGF 2 : కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులని సృష్టించింది. అయితే ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది.
అయితే సాధారణంగా ఓటీటీలలో సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులో ఉన్న సినిమాలు అన్నీ చూడొచ్చు. అయితే KGF, RRR సినిమాలు భారీ విజయం సాధించడంతో వీటికి ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాలనే కాన్సెప్టుతో వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ చాఫ్టర్ 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా ఈ సినిమాని చూడాలంటే రూ.199 చెల్లించాలి అని పెట్టారు.
అయితే ఇప్పటికే థియేటర్లో 200,300 పెట్టి చూసిన సినిమాని మళ్ళీ ఓటీటీలో కూడా 200 పెట్టి చూడాలి అంటే ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో చాలా మంది అమెజాన్‌లో ఈ సినిమా చూడకపోవచ్చు. కొన్ని రోజులు ఆగితే సినిమాని ఫ్రీ గానే ఇస్తాడు అప్పుడు చూసుకుందాంలే అని కొంతమంది ఆగిపోతున్నారు. ఇక థియేటర్లో చూసిన వాళ్ళైతే అమెజాన్‌లో 200 పెట్టి చూడటం వేస్ట్ అంటున్నారు. త్వరలో జీ5 కూడా RRR సినిమాకి ఇలాగే పెట్టనున్నట్టు సమాచారం. వీటి వల్ల ప్రేక్షకుల నుంచి అటు సినిమా వాళ్ళపైనా, ఇటు ఓటీటీ పైన వ్యతిరేకత వస్తుంది. మరి దీనిపై ఓటీటీలు కానీ సినిమా వాళ్లు కానీ స్పందిస్తారేమో చూడాలి.
ఒకవేళ ఈ పే పర్ వ్యూ సక్సెస్ అయితే ఓటీటీలు భవిష్యత్తులో పెద్ద సినిమాలన్నిటికీ ఇలాగే కొనసాగించే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక ఓటీటీలు పే పర్ వ్యూ పెట్టడంతో చాలా మంది పైరసీని ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల పైరసీని కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది.