AMB Cinemas: హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేశ్ మరో మల్టీప్లెక్స్ థియేటర్

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గచ్చిబౌలీ‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి..

AMB Cinemas: హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేశ్ మరో మల్టీప్లెక్స్ థియేటర్

Mahesh Babu

AMB Cinemas: సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గచ్చిబౌలీ‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి.. మొదటి మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్లను సొంతం చేసుకున్నమహేష్ బాబు తన రెండో మల్టీ‌ప్లెక్స్‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కానీ, నానక్‌రామ్‌గూడలో కానీ నిర్నించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

AMB సినిమాస్ కంటే ఎక్కవ స్క్రీన్‌లు ఈ ధియేటర్ లో ఉండబోతున్నాయి. AMB కంటే మెరుగైన లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో వినియోగిస్తారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తర్వాత మల్టీప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టిన హీరోల జాబితాలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉన్నారు. అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్‌తో కలిసి అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తుండగా… విజయ్ దేవరకొండ తన స్వస్ధలం మహబూబ్‌నగర్‌లో నిర్నిస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారువారిపాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా 2022 సంక్రాంతికి ధియేటర్లలో సందడి చేయనుంది. ఆ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.