Richard Carpenter : ఆస్కార్ విన్నింగ్ పై కీరవాణికి స్పెషల్ సాంగ్ డెడికేట్ చేసిన అమెరికన్ టాప్ మ్యుజిషియన్
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి కార్పెంటర్స్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఈరోజు నేను సంగీత దర్శకుడిగా ఆస్కార్ స్టేజి పై అవార్డుతో నిలుచున్నాను...................

Richard Carpenter : నాటు నాటు సాంగ్ తో ప్రపంచంలోనే అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్ ని కీరవాణి అందుకున్నారు. కీరవాణికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కీరవాణి, RRR టీం ఆస్కార్ విజయం పై పట్టలేని ఆనందంతో ఉన్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి ఆస్కార్ వేదికపై ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది.
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి కార్పెంటర్స్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఈరోజు నేను సంగీత దర్శకుడిగా ఆస్కార్ స్టేజి పై అవార్డుతో నిలుచున్నాను. There was only one wish on my mind. So Rajamouli’s and my families.. RRR has to win pride of every Indian and must put me on the top the world అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ తో అమెరికన్ పాప్ మ్యుజిషియన్స్ కార్పెంటర్స్ స్టైల్ లో పాడారు. దీంతో ఇది వైరల్ గా మారింది.
తాజాగా ఇది చూసిన కార్పెంటర్స్ టాప్ మ్యుజిషియన్ రిచర్డ్ కార్పెంటర్ పియానో వాయిస్తూ.. You are on the top the world.. అంటూ పాడి ఈ వీడియోని పోస్ట్ చేసి చంద్రబోస్, కీరవాణి లకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ అని తెలిపారు. దీంతో ఇది చూసి కీరవాణి, రాజమౌళి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో కింద రాజమౌళి.. ఈ ఆస్కార్ ప్రమోషన్స్ చేస్తున్నంత కాలం మా అన్నయ్య కీరవాణి సైలెంట్ గా ఉన్నాడు. ఆస్కార్ గెలిచిన తర్వాత, ముందు కూడా తన ఎమోషన్స్ ని చూపించలేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అతను కంట్రోల్ చేసుకోలేక ఎమోషన్ తో ఏడ్చేశాడు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇది మా ఫ్యామిలీకి. థ్యాంక్యూ సో మచ్ సర్ అని కామెంట్ చేశాడు.
ఇక ఈ వీడియోని కీరవాణి తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఇది నేను అస్సలు ఊహించలేదు. నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ప్రపంచంలోనే నాకు బెస్ట్ గిఫ్ట్ అని పోస్ట్ చేశారు. అమెరికన్ టాప్ మ్యుజిషియన్స్ కార్పెంటర్స్ నుంచి ఇలా అభినందనలు రావడంతో RRR టీంతో పాటు మరింతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://t.co/va5tOLD1DH
This is something I didn’t expect at all ..tears rolling out of joy ❤️❤️❤️ Most wonderful gift from the Universe 🙏— mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023