Veera Simha Reddy : వీరసింహారెడ్డి షో నిలిపివేత.. బాలయ్య ఫ్యాన్స్‌పై అమెరికన్ థియేటర్ ఓనర్ ఆగ్రహం..

నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ సినిమా వచ్చింది అంటే అమెరికా థియేటర్లు సైతం ఇండియా థియేటర్లను తలపిస్తాయి. కాగా అమెరికా లోని ఒక థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన పనికి వీరసింహారెడ్డి షోని మధ్యలోనే ఆపివేశారు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి షో నిలిపివేత.. బాలయ్య ఫ్యాన్స్‌పై అమెరికన్ థియేటర్ ఓనర్ ఆగ్రహం..

American theater owner angry with Balayya fans

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది. ఇక ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ సినిమా వచ్చింది అంటే అమెరికా థియేటర్లు సైతం ఇండియా థియేటర్లను తలపిస్తాయి. కాగా అమెరికా లోని ఒక థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన పనికి వీరసింహారెడ్డి షోని మధ్యలోనే ఆపివేశారు.

Veera Simha Reddy Review : బాలయ్య మార్క్ సినిమా.. యాక్షన్ ఎలేవేషన్‌లో బోయపాటిని మించిన గోపీచంద్..

అమెరికాలోని ఒక ముల్టీప్లెక్స్ థియేటర్ లో అభిమానులు.. బాలయ్య ఎంట్రీ సీన్, యాక్షన్ అండ్ సాంగ్స్ సమయంలో పేపర్లు చల్లి థియేటర్ మొత్తం కాగితాలతో నింపేశారు. ఇక అది చూసిన థియేటర్ మేనేజ్‌మెంట్ షో మధ్యలోనే నిలివేసి బయటకి వెళ్ళాలి అంటూ కోరింది. ‘ఇక్కడికి మీరందరు మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చారు అని నాకు తెలుసు. కానీ మేము ఈ షో నిలిపివిస్తున్నాము. దానికి కారణం మేరే. ఇక్కడ ఎన్నో ఇండియన్ సినిమాలు విడుదలైని. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇలా జరగలేదు. చూడండి థియేటర్ మొత్తం ఎలా చెత్త చెత్త చేసారో. దీనిని మేము అంగీకరించలేము, అందుకనే ఈ షో మధ్యలోనే ఆపేస్తున్నాము, కాబట్టి దయచేసి మీరందరు థియేటర్ నుంచి బయటకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము” అంటూ థియేటర్ ఓనర్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. అది బాలయ్య అంటే, జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. బాలకృష్ణ యాక్షన్ సీన్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో కూడా ఏడిపించేసాడు అని తెలుస్తుంది.