Amigos Movie: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’

నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించిన ‘అమిగోస్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.

Amigos Movie: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’

Amigos Movie Streaming Now On This OTT Platform

Amigos Movie: నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించిన ‘అమిగోస్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇక వైవిధ్యమైన కథనంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా క్రియేట్ అయ్యాయి.

Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’

అయితే, ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ప్రేక్షకుల్లో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, సినిమా కథనం ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే థియేటర్ల నుండి బయటకు వచ్చేసింది.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమిని

కాగా, తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అమిగోస్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించి ఎంజాయ్ చేయవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, రాజేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.