Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..

ఇక ప్రాజెక్ట్ K సినిమా శరవేగంగా హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో..............

Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..

Amitabh Bachchan :  ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ K షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా బిగ్ బి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్ K మూవీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చి తన చేతుల మీదుగా ఓపెన్ చేశారు.

Pavitra Lokesh : సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..

ఇక ప్రాజెక్ట్ K సినిమా శరవేగంగా హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో షూటింగ్ లో పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం సాయంత్రం రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ప్రాజెక్ట్ K సినిమా షూట్ జరిగింది. అమితాబ్ పై కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు.