Amitabh Bachchan : ఆన్ స్క్రీన్ తల్లి సులోచనను గుర్తు చేసుకున్న అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ నటి సులోచన లట్కర్ మరణం బాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది. 1960 ల నుంచి 80 ల వరకూ తల్లి పాత్రలో అలరించిన సులోచన బిగ్ బీ అమితాబ్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంలో తన స్క్రీన్ తల్లి సులోచన మరణం తనను ఎంతో బాధించిందని బిగ్ బీ విచారం వ్యక్తం చేశారు.

Amitabh Bachchan :  ఆన్ స్క్రీన్ తల్లి సులోచనను గుర్తు చేసుకున్న అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan

Amitabh Bachchan : ప్రముఖ నటి సులోచన లట్కర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కొత్త బ్లాగులో తన ఆన్ స్క్రీన్ తల్లిని గుర్తు చేసుకున్నారు.

Amitabh Bachchan : ఆన్ స్క్రీన్ తల్లి సులోచనను గుర్తు చేసుకున్న అమితాబ్ బచ్చన్

ప్రముఖ నటి సులోచన అనారోగ్య కారణాలతో తన 94వ ఏట చనిపోయారు. ఈ సందర్భంలో అమితాబ్ బచ్చన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు ఆయన తన బ్లాగ్‌లో రాసారు. సులోచన గారి మరణం తనకు ఎంతో విచారాన్ని కలిగించిందని అమితాబ్ చెప్పారు. ఈ సందర్భంలో ఆమెతో కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నట్లు ఆయన బ్లాగ్‌లో రాశారు. సులోచన అనేక సినిమాల్లో అమితాబ్ బచ్చన్‌కు తల్లిగా నటించారు.

 

సౌమ్యమైన, ఉదారమైన తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. అయితే కొంతకాలంగా సులోచన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నటి సులోచన అమితాబ్‌తో రేష్మా ఔర్ షేరా, యారానా, ముఖద్దర్ కా సికందర్, మజ్బూర్, రోటీ కపడా ఔర్ మకాన్ వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.

Amitabh Bachchan : రోడ్డుపై వెళ్తున్న ఓ పోలీస్ వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్.. వీడియోలో ఏముంది.. అంటే?

సులోచన 1940 లలో తన కెరియర్‌ను ప్రారంభించారు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో దాదాపుగా 250 సినిమాల్లో నటించారు. మరాఠీలో ససుర్వాస్, వాహినిచ్యా బంగ్ద్యా, ధక్తి జౌ..హిందీలో ఆయే దిన్ బహర్ కే, గోరా ఔర్ కాలా, దేవర్, తలాష్ మరియు ఆజాద్ వంటివి సులోచన గారు నటించిన సినిమాల్లో ప్రముఖమైనవి. 1960, 1970, 1980 లలో బాలీవుడ్ సినిమాల్లో ఆన్-స్క్రీన్ తల్లిగా నటించారు. ఆమె సునీల్ దత్, దేవ్ ఆనంద్, రాజేష్ ఖన్నా మరియు దిలీప్ కుమార్‌తో సహా పలువురు ప్రముఖులతో కలిసి నటించారు.