కరోనాను ఖతం చేస్తానంటున్న మెగాస్టార్

తాను సూపర్ మ్యాన్‌లా మారిపోయి కరోనాను అరికడతానంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్..

  • Published By: sekhar ,Published On : March 21, 2020 / 11:16 AM IST
కరోనాను ఖతం చేస్తానంటున్న మెగాస్టార్

తాను సూపర్ మ్యాన్‌లా మారిపోయి కరోనాను అరికడతానంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్..

నాకే కనుక సూపర్ పవర్స్ ఉంటే కరోనా వైరస్‌ను నామ రూపాల్లేకుండా చేస్తానంటున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుపుతూ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’తో పాటు, ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా బిగ్ బి అమితాబ్ తానే గనుక సూపర్‌ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కొన్ని దశాబ్ధాల క్రితం దిగిన ఓ అరుదైన ఫోటోను అమితాబ్‌ షేర్‌ చేశారు. ఆ ఫోటోలో సూపర్‌ మ్యాన్‌ దుస్తుల్లో ఉన్నారాయన.

‘చాలా ఏళ్ల క్రితం అభిషేక్‌  డ్రెస్‌ బర్త్‌డే పార్టీ సందర్భంగా వేసుకున్న ఫ్యాన్సీ డ్రెస్‌ అప్పటి పిక్. సూపర్‌ మ్యాన్‌ థీమ్‌ డ్రెస్‌. నేను నిజజీవితంలో సూపర్‌ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కాగా తనను కలిసేందుకు జల్సా గేట్ వద్దకు రావొద్దని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు అర్థం చేసుకోవాలని.. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తగు జాగ్రత్తలు తీసుకుని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని బిగ్‌ బి సూచించారు.