కౌన్ బనేగా కరోడ్‌పతిలో తెలంగాణ టీచర్.. ఎమోషనల్ అయిన అమితాబ్

  • Published By: vamsi ,Published On : October 6, 2020 / 05:02 PM IST
కౌన్ బనేగా కరోడ్‌పతిలో తెలంగాణ టీచర్.. ఎమోషనల్ అయిన అమితాబ్

Amitabh Bachchan:కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో అప్పట్లో ఇటువంటి షో జరిగేది. నాగార్జున, చిరంజీవి ఈ షో ను తెలుగులో హోస్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు అది ఆగిపోయింది. కానీ, మాతృక హిందీలో మాత్రం ఈ షో 12వ సీజన్‌ని నడిపిస్తున్నారు. హిందీలో ఈ షోని బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ కార్యక్రమానికి రేటింగ్ కూడా గట్టిగానే ఉంటుంది.



దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ షోలో సోమ‌వారం ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో ముందుగా బ‌జ‌ర్ మోగించి స‌మాధానం చెప్పిన ప్రదీప్ కుమార్ సూద్ హాట్ సీట్‌లో కూర్చొని గేమ్ ఆడారు. పంజాబ్‌ అమృత్‌స‌ర్ నుంచి వ‌చ్చిన ప్రదీప్ రూ.12.5 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుని ఆట నుంచి క్విట్ అయ్యారు.



అయితే, ఆ తర్వాత కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన వ్యక్తి తెలంగాణకు చెందిన సబితా రెడ్డి.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సబితా ఒక టీచర్,, అమితాబ్ బచ్చన్‌తో కలిసి హాట్ సీట్‌లో కూర్చొనే అవ‌కాశం పొందారు. సాధారణంగా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో కంటెస్టెంట్‌లుగా పాల్గొనే వారి లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించే సంగతి తెలిసిందే. అలాగే టీచ‌ స‌బితాకు లైఫ్ జ‌ర్నీ వీడియోను కూడా షోలో ప్లే చేశారు. ఆ వీడియో చూసిన బిగ్ బీ ఎమోషనల్ అయ్యారు.



ఆమె స్పూర్తివంత‌మైన జీవితాన్ని చూసి అమితాబ్ బచ్చన్ ఎమోష‌న‌ల్ అయ్యారు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత పిల్లల‌ని చ‌దివించి పెద్దవాళ్లను చేసిన తీరు.. అమితాబ్ మ‌న‌సుని క‌దిలించింది. పిల్లల‌కు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు. మంచి విద్యను అందించాలనే పట్టుదలతో సబిత వారిని చదివించిన తీరును అమితాబ్ అభినందించారు. సింగిల్ పేరెంట్‌గా సబిత పడిన కష్టాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ మంగ‌ళ‌వారం రాత్రి ప్రసారం కానుంది. ఈ గేమ్ షో సోనీ టీవీలో ప్రసారం అవుతుంది.